close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో..

కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంతో సుకుమార్‌ శిష్యుడు కార్తీక్‌ దండు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శుక్రవారం ఈ చిత్ర ప్రీలుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో చిత్రాన్ని రూపొందించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి తగ్గట్లుగానే ప్రచార చిత్రాన్ని ఆసక్తికరంగా డిజైన్‌ చేసింది. ఆ పోస్టర్‌లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు షట్‌చక్రంలో నుంచి సీరియస్‌గా చూస్తున్న ఓ కన్నును చూపించారు. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. ఈ చిత్ర పోస్టర్‌ను సాయితేజ్‌ ట్విటర్‌ ద్వారా పంచుకుంటూ.. ‘‘సరికొత్త జానర్‌లో సినిమాలు చెయ్యడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అది నాకెంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్‌తో పనిచేయడం మరింత ప్రత్యేకం’’ అని ట్వీటారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.