close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాహుల్‌  కొత్త చిత్రం ప్రారంభం

‘హ్యాపీడేస్‌’తో టైసన్‌గా గుర్తుండిపోయారు రాహుల్‌. ఆయన, చేతన్‌ కథానాయకులుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాక్షి చౌదరి, ఐశ్వర్య, యమీ కథానాయికలు. విరాట్‌ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. నాగం తిరుపతిరెడ్డి, శ్రీకాంత్‌ దీపాలతో కలిసి సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌ ముఖ్య అతిథిగా హాజరై, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతల్లో ఒకరైన సాయికార్తీక్‌ క్లాప్‌నిచ్చారు. నాగం తిరుపతిరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. శ్రీకాంత్‌ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన థ్రిల్లర్‌ కామెడీ చిత్రమిది. జనవరికి చిత్రాన్ని పూర్తి చేస్తాం’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘తెలుగుతోపాటు కన్నడలోనూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. విభిన్నమైన వినోదంతో ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది’’ అన్నారు. రాహుల్‌ మాట్లాడుతూ ‘‘కథ విన్నప్పుడు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు అంతే అనుభూతికి గురవుతార’’న్నారు. ‘‘ఇప్పటివరకు కన్నడలో 10 సినిమాలు చేశా. తెలుగులో రాహుల్‌తో కలిసి నటిస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు మరో కథానాయకుడు చేతన్‌.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు