close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభాస్‌ కొత్త చిత్రం...‘సలార్‌’

‘బాహుబలి’ చిత్రాల తర్వాత పాన్‌ ఇండియా సినిమాలకి కేరాఫ్‌గా మారారు ప్రభాస్‌. ఆయన వరుసగా కొత్త సినిమాలకి పచ్చజెండా ఊపుతున్నారు. అన్నీ పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలుగా రూపొందుతున్నవే. ‘కె.జి.ఎఫ్‌’ దర్శకనిర్మాతలతోనూ ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్నారు. ‘సలార్‌’ పేరుతో ఆ చిత్రం రూపొందుతోంది. బుధవారం సినిమాని అధికారికంగా ప్రకటించడంతోపాటు ప్రభాస్‌ లుక్‌నీ విడుదల చేసింది చిత్రబృందం. హోంబలే ఫిలింస్‌ పతాకంపై, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’ చిత్రాన్ని భారతీయ భాషలన్నింటినీలోనూ విడుదల చేస్తామని నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ తెలిపారు. ‘‘మా సంస్థలో ‘కె.జి.ఎఫ్‌’ వరుస చిత్రాల తర్వాత రూపొందుతున్న మూడో పాన్‌ ఇండియా చిత్రమిది. వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణని ప్రారంభిస్తాం. ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ విడుదల తర్వాత, మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాం’’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు