‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పసందైన యాక్షన్ హంగామాని చూపించారు కథానాయకుడు ప్రభాస్. అందుకే ఇప్పుడాయన కొత్తగా ‘రాధేశ్యామ్’తో ఓ విభిన్నమైన ప్రేమకథను రుచి చూపించేందుకు సిద్ధమయ్యారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే నాయిక. ఇందులో ప్రభాస్ పెదనాన్న.. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ ఇద్దరూ గతంలో ‘బిల్లా’, ‘రెబల్’ చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం కోసం తెర పంచుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పరమహంస అనే పాత్రలో కృష్ణంరాజు దర్శనమిస్తారని, ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో తుది దశ చిత్రీకరణలో ఉంది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
రెండోసారి.. పంథా మారి
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’