
కథానాయకుడిగా వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న నాని మరోవైపు నిర్మాతగానూ జోరు చూపిస్తున్నారు. ఆయన తొలి చిత్రం ‘అ!’తోనే మంచి అభిరుచి గల నిర్మాతగా ప్రేక్షకుల మెప్పు పొందారు. రెండో ప్రయత్నం ‘హిట్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2’ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. తొలి భాగాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ రెండో భాగం రూపొందనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీక్వెల్లో కథానాయకుడు మారబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
తొలి భాగంలో విష్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో చిత్రం కోసం అడివి శేష్‌ను తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. నిజానికి ఈ సీక్వెల్‌ను విష్వక్తోనే చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆ పాత్ర కోసం శేష్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. అడివి శేష్ ప్రస్తుతం మహేష్‌బాబు నిర్మాణంలో ‘మేజర్’ చిత్రం చేస్తున్నారు. దీంతో పాటు ‘గూఢచారి 2’ చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!