ఆలియా..హృతిక్‌లకు ఆస్కార్‌ ఆహ్వానం
close
Published : 02/07/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలియా..హృతిక్‌లకు ఆస్కార్‌ ఆహ్వానం

స్కార్‌ పురస్కారం అందు కోవడం నటుల కల. కనీసం ఆ వేడుకలో పాల్గొనే అవకాశం దక్కినా సంతోషమే. ఆస్కార్‌ అకాడెమీ ఏటా ప్రకటించే అతిథుల జాబితాలో చోటుంటే ఆ గౌరవం...ఆనందమే వేరు. అలాంటి గౌరవం ఈసారి బాలీవుడ్‌ నటులు హృతిక్‌రోషన్‌, ఆలియాభట్‌లకు దక్కింది. 93వ ఆస్కార్‌ పురస్కారాల వేడుక వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందుతుంది. ఈసారి 819 సభ్యులకు ఆహ్వానం పంపినట్టు అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ట్విటర్‌లో ప్రకటించింది. ఈ జాబితాలో మనదేశం నుంచి చోటు దక్కించుకున్నవాళ్లులో కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతూ లుల్లా, కాస్టింగ్‌ డైరెక్టర్‌ నందినీ శ్రీకెంట్‌, డాక్యుమెంటరీ రూపకర్తలు నిషితా జైన్‌, అమిత్‌ మధేషియా, విజువల్‌ ఎఫెక్ట్స్‌  సూపర్‌వైజర్స్‌ విశాల్‌ ఆనంద్‌, సందీప్‌ కమల్‌లు ఉన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని