close
ఓటీటీ సంగతులు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెబ్‌సిరీస్‌లో అతిథిగా కియారా

ముంబయి: అందాల నాయిక కియారా అడ్వాణీ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో తళుక్కుమనబోతుంది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా జీవితంపై ‘మసాబా మసాబా’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఇందులో ఓ సినిమా హీరోయిన్‌గా కనిపించనుంది కియారా. మసాబా స్టోర్‌కి వెళ్లి ఓ డ్రెస్‌ కొనుగోలు చేసే సన్నివేశంలో ఆమె నటించింది. ఈ సన్నివేశంలో ఎంతో వినోదం పండిందని చెబుతోంది కియారా.

‘‘ఈ చిత్ర నిర్మాత అశ్విని నాకు ఈ వెబ్‌సిరీస్‌ గురించి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చేసింది. ఇందులో నువ్వు ఓ గెస్ట్‌రోల్‌ చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాను’’అని చెప్పింది కియారా. నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న ఈ సిరీస్‌ను సోనమ్‌ నాయర్‌ తెరకెక్కిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.