
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ రికార్డులు సృష్టిస్తుంటారు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఇలా.. పేరేదైనా మహేశ్‌కు ఉన్న క్రేజే వేరు. ఇదంతా ఇప్పుడెందుకంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మరోమైలురాయిని అధిగమించారు. తాజాగా.. ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య 6 మిలియన్లు దాటింది. గతంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించని ఆయన ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనే ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తున్నారు. ఇలా తాజాగా ఆయన 6 మిలియన్ల క్లబ్లో చేరారు. ట్విటర్లోనూ మహేశ్‌బాబును ఏకంగా 10.9మిలియన్లు అనుసరిస్తున్నారు. అత్యధిక ఆదరణ కలిగిన సౌత్ఇండియన్ స్టార్‌గానూ ఈ సూపర్‌స్టార్ రికార్డు సృష్టించాడు.
ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా మహేశ్‌బాబు కూతురు సితార, భార్య నమ్రత చేతుల మీదుగా చేయించారు. సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. జీఎం, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరిలో రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు