ప్రియుడితో పెళ్లి వద్దన్నందుకు తల్లినే చంపేసింది
close

తాజా వార్తలు

Published : 13/05/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియుడితో పెళ్లి వద్దన్నందుకు తల్లినే చంపేసింది

సహజ మరణంగా నమ్మించేందుకు యత్నించిన కుమార్తె
విజయనగరం జిల్లా సవరవిల్లిలో దారుణం

భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న కన్నతల్లిని చంపేసింది. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేసి కటాకటాల్లోకి పంపారు.  విజయనగరం డీఎస్పీ అనిల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6న లక్ష్మి (40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతిచెందినట్లు కేసు నమోదైంది. వైద్యులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కూపీ లాగారు. 

ప్రియుడు వరుణ్‌సాయితో పెళ్లికి అడ్డుచెప్పినందుకు తల్లిని చంపాలని కుమార్తె రూపశ్రీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని ప్రియుడి సాయంతో దిండుతో అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేసింది. చనిపోయిందని భావించడంతో ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోగా.. రూపశ్రీ ఏమీ తెలియనట్లు తండ్రికి సమాచారం ఇచ్చింది. కిందపడి తల్లి చనిపోయిందంటూ సహజ మరణంగా నమ్మబలికింది. అయితే తండ్రి ఓ ఆర్‌ఎంపీ వైద్యుడికి సమాచారం ఇవ్వడంతో అతడు లక్ష్మిని పరిశీలించి ప్రాణం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు రూపశ్రీ, వరుణ్‌సాయిలను అరెస్ట్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని