లారీని ఢీకొన్న‌ కారు.. నలుగురి మృతి
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 08:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లారీని ఢీకొన్న‌ కారు.. నలుగురి మృతి

పెద్దాపురం, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద ఈ ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గృహప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరానికి తొమ్మిది మంది కుటుంబసభ్యులు ఓ కారులో బయలుదేరారు. పెద్దాపురంలోని ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్దకు చేరుకునేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉంది. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘ‌ట‌నపై కేసు  న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని