Crime News: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం!

తాజా వార్తలు

Updated : 14/10/2021 14:30 IST

Crime News: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం!

రాజేంద్ర నగర్‌: హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఫురానాపూల్‌కు చెందిన మహిళ (30) రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని హైదర్‌గూడకు బుధవారం సాయంత్రం వచ్చింది. స్థానికంగా ఉండే ఓ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగేందుకు వెళ్లింది. అక్కడ పక్కనే కూర్చున్న ఓ ఆటో డ్రైవర్‌ మహిళను గమనించి ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడు. 

ఈ క్రమంలో మాటా మాటా కలుపుతూ ఆమెను ఇంటి దగ్గర దించి వెళ్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మహిళ ఆటోలో వెళ్లింది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా అదే ఆటో ఎక్కారు. అక్కడి నుంచి ఆమెను హిమాయత్‌సాగర్‌ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. మత్తు నుంచి కోలుకున్న బాధితురాలు గురువారం ఉదయం స్థానికుల సహకారంతో రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ కనకయ్య తెలిపారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని