Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురు

తాజా వార్తలు

Published : 12/10/2021 01:16 IST

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురు

మూడోసారి బెయిల్ నిరాకరించిన కోర్టు 

ముంబయి: బాలీవుడ్ స్టార్‌ షారుఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు సోమవారం కూడా బెయిల్ దొరకలేదు. ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా ముంబయి కోర్టు మూడోసారి బెయిల్ నిరాకరించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఆర్యన్ గత వారం రోజులుగా ముంబయి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) తన స్టేట్‌మెంట్‌ను కోర్టుకు సమర్పించిన తర్వాత బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

వాస్తవంగా శుక్రవారం వరకు ఆర్యన్ కస్టడీని పొడిగించాలని ఎన్‌సీబీ కోర్టును కోరింది. ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన కోర్టు.. ఎన్‌సీబీకి బుధవారం వరకు మాత్రమే గడువు ఇచ్చింది. కాగా, ఆర్యన్ ఖాన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. ఈ రోజు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. అతడి వద్ద డ్రగ్స్‌ను గుర్తించలేదని వెల్లడించారు. ఇన్నిరోజులు కస్టడీలో ఉంచడం సరికాదని వాదించారు.

ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని, అతడిని విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఇదివరకే ఎన్‌సీబీ కోర్టుకు వెల్లడించింది. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని