ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న కిలోన్నర బంగారు నగలు స్వాధీనం

తాజా వార్తలు

Updated : 15/08/2021 04:42 IST

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న కిలోన్నర బంగారు నగలు స్వాధీనం

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన షేక్‌ ముస్తాక్‌ హాక్‌ ఆర్టీసీ బస్సులో తెలంగాణలోని గద్వాల నుంచి కర్నూలుకు ఒక కేజీ 447 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని వస్తుండగా సెబ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సును తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని