Crime News: శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరంలో యువతి అనుమానాస్పద మృతి

తాజా వార్తలు

Updated : 14/10/2021 17:29 IST

Crime News: శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరంలో యువతి అనుమానాస్పద మృతి

సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరం వద్ద గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపింది. గురువారం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి నౌపాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి ఆమె గురువారం భావనపాడు సముద్రతీరానికి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకోవడంతో సమీపంలోని జీడిమామిడి తోటకు వెళ్లి యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నౌపాడ ఎస్సై సాయికుమార్‌ పరిశీలించారు. ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని