పట్టపగలు ఎవరి కోసం రెక్కీ?

తాజా వార్తలు

Published : 15/07/2021 01:36 IST

పట్టపగలు ఎవరి కోసం రెక్కీ?

కర్నూలు: ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్‌ గొడవలు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తున్నాయి. తాజాగా గోవిందపల్లె గ్రామంలో పట్టపగలే  రెక్కీ నిర్వహించడం ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉన్న స్కార్పియో వాహనం కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో పట్టపగలే రెక్కీ నిర్వహించడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం కారులో తిరిగిన దుండగులు  అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్‌ రవిచంద్రారెడ్డి ఇంటి ముందు కారు ఆపారు. ఇది గమనించిన ఆయన భార్య  పోలీసులకు సమాచారమిచ్చారు. గోవిందపల్లెకు చేరుకున్న పోలీసులు కారును వెంబడించారు. అతివేగంతో ప్రయాణించిన కారు మెట్టపల్లి వద్ద ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. 

స్థానికులు కారును వెంబడించడంతో మెట్టపల్లి-ఆలమూరు రహదారి వద్ద స్కార్పియోను వదిలేసిన దుండగులు నల్లమల అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రవించద్రారెడ్డి మాజీ మంత్రి అఖిలప్రియకు ప్రధాన అనుచరుడు. తెలుగుదేశం నేత ఏవీ సుబ్బారెడ్డిపై గతంలో జరిగిన హత్యాయత్నం సహా.. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని హతమార్చడానికే దుండగులు వచ్చినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ద్విచక్రవాహనం నెంబరు ప్లేట్‌తో వచ్చిన ఆ కారు ఎవరిదితో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆళ్లగడ్డ పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని