Updated : 14/04/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెవెన్యూ, అటవీ శాఖల దాగుడుమూతలు

కొండపల్లి భూముల సర్వేపై ప్రతిష్టంభన
ఈనాడు, విజయవాడ

కొండపల్లి రిజర్వు ఫారెస్టు

క సారి సర్వే చేశారు.. అది ప్రభుత్వ పోరంబోకు అని నివేదిక ఇచ్చారు..  మరోసారి సంయుక్త తనిఖీ జరిగింది... అటవీ భూమే అని నిర్ధారించారు. గత కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని, సభ్యులపై చర్యలు తీసుకోవాలని తాజా కమిటీ సిఫార్సు చేసింది. మరోసారి సర్వే అన్నారు.. సంయుక్త సర్వే జరగదు.. ఎంత తవ్వకాలు జరిపారో.. లెక్కలు తీయరు...  మరో వైపు అటవీశాఖ భూముల నుంచి చిన్న పుల్ల తరలించినా.. మొక్క నాటినా.. కేసులు పెడుతున్నారు. కానీ వందల ఎకరాలకు సంబంధించిన వివాదం మాత్రం నిగ్గు తేల్చడం లేదు. కొండపల్లి అభయారణ్యం భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీశాఖలు దాగుడు మూతలు ఆడుతున్నాయి.
ఓ ప్రజాప్రతినిధి బంధువు దీనిలో కీలక సూత్రధారి కావడంతో అంతా మిన్నకుంటున్నారు. అందులో భాగంగా ఆ భూములు అసలు అటవీశాఖకు చెందినవే కావనే వాదన లేవనెత్తారు. ఈ వివాదంపై త్రిసభ్య కమిటీని నియమించగా ఆ భూములు అభయారణ్యానికి చెందినవిగా తేల్చారు. దాన్ని నేతలు అంగీకరించలేదు. మరోసారి సర్వే చేయించాలని ప్రతిపాదించి ఉన్నత స్థాయినుంచి ఆదేశాలు జారీ చేయించారు. ఈ సర్వే ఊసే లేకుండాపోయింది. 2020 ఆగస్టులో విజయవాడ సబ్‌కలెక్టర్‌ ధ్యానచంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి మంగమ్మ, గనుల శాఖ ఏడీ నాగిని సభ్యులుగా కమిటీ వేశారు. ఆ భూములు అటవీ శాఖకు చెందినవేగా తేల్చారు. దీని కంటే ముందు ఒక త్రిసభ్య కమిటీ వేశారు. ఆ కమిటీ మాత్రం ఆ భూములు ప్రభుత్వ పోరంబోకు అని నిర్ణయించి క్వారీ లీజులకు అవకాశం కల్పించారు. ఈ రెండు కమిటీలు భిన్నమైన నివేదికలు ఇచ్చాయి. మొదటి కమిటీలో  సభ్యులు తప్పుడు నివేదిక ఇచ్చారని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని రెండో కమిటీ సిఫార్సు కూడా చేసింది. ఈ సిఫార్సు అసలు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.

వాస్తవం ఏమిటి..?
కడెంపోతవరం గ్రామపటం ప్రకారం సర్వేనెంబర్లు 1,4,6,7,48,49,50,53,54 కొండపల్లి రిజర్వు ఫారెస్టుకు సరిహద్దు. దీని ప్రకారం అన్‌సర్వే బ్లాక్‌లు లేవని అటవీశాఖ వాదన. సర్వే నెంబరు 26/2లో మొత్తం 256.15 ఎకరాలు ఉంది. పట్టాదారు, అనుభవదారు కాలమ్‌లో అడవిగానే పేర్కొన్నారు. ఇక్కడ ఒక అన్‌సర్వే బ్లాక్‌ ఉందని దానికి లీజులు జారీ చేశారు. అన్‌సర్వే బ్లాక్‌ అనేది రెవెన్యూ సృష్టి. ఈ బ్లాక్‌లో 250 ఎకరాలు ఉందని జి.కొండూరు తహసీల్దారు నిరభ్యంతరపత్రం జారీ చేయడం, దానికి గనుల శాఖ లీజులు ఇవ్వడం జరిగిపోయాయి. ఇదే వివాదానికి కారణమైంది.  రెవెన్యూ అధికారుల ఎన్‌ఓసీలతో గనుల శాఖ మొత్తం 30లీజులు జారీ చేశారు. 26/2లో18, అన్‌సర్వే బ్లాక్‌గా చెబుతున్న భూమిలో 12 ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని