Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేడు 72,136 మందికి కొవిడ్‌ టీకా

మాధవీలత, జేసీ

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కొవిడ్‌ టీకా ఉత్సవ్‌లో భాగంగా ఈనెల 14వ తేదీన బుధవారం జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలో వ్యాక్సినేషను ఇవ్వనున్నట్టు జేసీ కె.మాధవీలత ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 72,136 డోసులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. 45 సంవత్సరాల వయసు పైబడిన వారు, రెండో దఫా తీసుకోవాల్సిన వారికి ఇవ్వనున్నట్టు వివరించారు. ఎంపిక చేసిన సచివాలయాలు, అర్బన్‌ పీహెచ్‌సీలు, పీపీ యూనిట్‌ సెంటర్లలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ, మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది, రెండో దఫా తీసుకోవాల్సిన వారు టీకాలు వేయించుకోవాలని సూచించారు. గుడివాడ రెవెన్యూ డివిజనులో 13,777 మందికి 30 గ్రామీణ సచివాలయాలు, 4 పట్టణ అర్బన్‌ పీహెచ్‌సీలు, పీపీ యూనిట్లలో వేయనున్నట్టు తెలిపారు. మచిలీపట్నం డివిజనులో 17,319 మందికి 25 గ్రామీణ సచివాలయాలు, 4 పట్టణ అర్బన్‌ పీహెచ్‌సీలు, పీపీ యూనిట్లలో, నూజివీడు డివిజనులో 15,381 మందికి 25 గ్రామీణ సచివాలయాలు, 4 పట్టణ అర్బన్‌ పీహెచ్‌సీలు, పీపీ యూనిట్లలో, విజయవాడ రెవెన్యూ డివిజనులో 15,535 మందికి 19 గ్రామీణ సచివాలయాలు, 3 పట్టణ అర్బన్‌ పీహెచ్‌సీలు, పీపీ యూనిట్లలో ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
నగరంలో 10,124 మందికి..  
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 10,124 మందికి 29 అర్బన్‌ పీహెచ్‌సీలు, అర్బన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కేంద్రాల్లో టీకా వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జేసీ వివరించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, చేతుల శుభ్రత, భౌతిక దూరం పాటించాలని మాధవీలత సూచించారు.

261 పాజిటివ్‌ కేసుల నమోదు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 261 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటితో మొత్తం వాటి సంఖ్య 53396కి చేరింది. 2876 మంది బాధితులు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 49828 మంది బాధితులు వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. ఒకరు కరోనాతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 692కి చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని