Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పైస్‌జెట్‌ సర్వీసుల రద్దు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పలు విమాన సర్వీసుల రద్దు అందుకు కారణంగా తెలుస్తోంది. కనీస ప్రయాణికుల నిష్పత్తి 30 శాతం కంటే తక్కువగా రాకపోకలు సాగించే వారు ఉండటంతో పలు సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా స్పైస్‌జెట్‌ సంస్థ తమ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ సర్వీసులను ఒక్కొక్కటిగా రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో విజయవాడ చేరుకోవాల్సిన నాలుగు స్సైస్‌జెట్‌ సర్వీసులు రద్దయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల తగ్గుదలకు దేశంలో కరోనా కేసుల పెరుగుదలే ప్రధాన కారణంగా తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని