Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగరంలో ఎక్కడెక్కడంటే..

విజయవాడ నగర పాలక సంస్థ, న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తి ప్రస్తుతం అధికంగా ఉన్నందున 45 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఒక ప్రకటనలో సూచించారు. తుమ్మలపల్లికళాక్షేత్రం, పాతబస్‌స్టాండ్‌, విద్యాధరపురం ఆర్టీసి డిపో, ఎలక్ట్రికల్‌ లోకోషెడ్‌, మిల్క్‌ప్రాజెక్టు, ఖుద్ధూస్‌నగర్‌, కోచింగ్‌డిపో, రైల్వే ఇనిస్టిట్యూట్‌, గుంటుపల్లి వ్యాగన్‌ వర్కుషాపు వంటి వివిధ ప్రాంతాల్లో టీకా వేసేందుకు బుధవారం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు.
ఈ ప్రాంతాల్లో: ప్రభుత్వ ఆస్పత్రితోపాటు, నగర పాలక సంస్థ పరిధిలోని గుణదల, క్రీస్తురాజపురం, గిరిగిపురం, అంబేడ్కర్‌నగర్‌ పీహెచ్‌సీలు, పటమట, రామలింగేశ్వరనగర్‌, రాణిగారితోట, లబ్బిపేట, కరకట్ట సౌత్‌, కృష్ణలంక, మధురానగర్‌ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో టీకా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అజిత్‌సింగర్‌, దుర్గాపురం, బాప్టిస్టుపాలెం, భీమనవారిపేట, గులాంమొహిద్ధీన్‌నగర్‌, న్యూజ్యోజినగర్‌, కొత్తపేటకొండప్రాంతం, కొత్తపేట ఏరియా, వించిపేట, న్యూ రాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ, శాంతినగర్‌, రాజీవ్‌నగర్‌, ప్రకాశ్‌నగర్‌, కండ్రిక పీహెచ్‌సీల్లోనూ టీకా అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
వార్డు సచివాలయాల్లో: నగరంలోని గుణదల షిర్డీనగర్‌, సత్యనారాయణపురం, ప్రకాశ్‌నగర్‌, మొగల్రాజపురం, దర్శిపేట, శ్రీనివాసనగర్‌, పటమట, ఈనాడు కాలనీ, శాంపిల్‌బిల్డింగ్‌ ఏరియా, పాయకాపురం, అవుటేజెన్సీ, భవానీపురం దుర్గాప్లాట్స్‌ ఏరియా, కృష్ణలంక ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లో టీకా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇక వాంబేకాలనీ, మధ్యకట్ట, దుర్గాపురం, బాప్టిస్టుపాలెం, బ్రహ్మంగారిమఠం, చిన్నరామాలయం ఏరియా, టేనర్‌పేట, కుమ్మరిబజార్‌ ఏరియా, మల్లికార్జునపేట, వించిపేట, అంబ్కేర్‌కాలనీ, వాంబేకాలనీ, పాత రాజీవ్‌నగర్‌, ఎల్‌బీఎస్‌ నగర్‌, ప్రకాశ్‌నగర్‌ ప్రాంతాల్లోని వార్డు సచివాయాల్లో కూడా టీకా అందుబాటులో ఉందని కమిషనర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని