Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగదు కావాలా.. ల్యాప్‌టాపా..?

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

తల్లిదండ్రులు అభిప్రాయాలు తెలపాల్సిన లేఖ ఇదే

మ్మ ఒడి పథకం డబ్బులు వద్దనుకునే 9, 10, ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకలను విడుదల చేసింది. దీనికి సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించే పనిలో విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు.
తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ : ఇప్పటి వరకు రెండు విద్యా సంవత్సరాలు అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు నగదు అందించారు. రానున్న మూడో విద్యా సంవత్సరానికి అమ్మ ఒడికి అర్హత కలిగిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందించేందుకు తల్లిదండ్రుల నుంచి ముఖ్యమంత్రి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి లేఖను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు పంపించి అభిప్రాయాన్ని సోమవారం నుంచి సేకరిస్తారు. సీఎం లేఖపై ముద్రించిన అమ్మఒడి డబ్బులు కావాలా, ల్యాప్‌టాప్‌ కావాలా అనే అభిప్రాయాన్ని తల్లిదండ్రులు రాసి ఉపాధ్యాయులకు అందించాలి. ఇందుకు గ్రామ వాలంటీర్ల సేవలను కూడా వినియోగించుకోవచ్చని సూచించారు. అమ్మఒడి నగదు కావాల్సిన వారికి ఇవ్వడం, వద్దన్న వారికి ల్యాప్‌టాప్‌లు ఇస్తారు.
రానున్న విద్యా సంవత్సరం నుంచి..: అమ్మఒడి సొమ్ములకు బదులు ల్యాప్‌టాప్‌ ఇచ్చే కార్యాక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ లోగా విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు ఎంత మందికి ఇవి కావాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దాని ఆధారంగా వాటిని సేకరిస్తారు.
జిల్లాలో 9, 10, ఇంటర్‌ విద్యార్థులు సుమారు లక్షకు పైగా ఉంటారని అంచనా. గ్రామ వాలంటీర్లు తల్లిదండ్రులను కలిసి భవిష్యత్తులో నిర్వహించనున్న ఆన్‌లైన్‌ తరగతులు, ప్రాజెక్టుల తయారీ ఇతర కార్యక్రమాలకు వాటి ఉపయోగం, అంతర్జాల సౌకర్యం  తదితరాలను వివరిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని