Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఉగాది వేడుకలు

పంచాంగం విడుదల చేస్తున్న లంకా వెంకటేశ్వరశాస్త్రి, శివప్రసాదశర్మ, వైదిక కమిటీ సభ్యులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీప్లవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేకువ జామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం శాస్త్రోక్తంగా రుత్వికులు నిర్వహించారు. అలంకరణ హారతి అనంతరం ఉదయం 8గంటలకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించారు. గోశాల ఎదురుగా దుర్గమ్మ ఉత్సవ మూర్తిని వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య రుత్వికులు ప్రతిష్ఠించారు. వసంత నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాత దుర్గమ్మను మల్లెలు, మరువంతో తొలి రోజున అర్చన చేశారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు.
భక్తుల సమక్షంలో పంచాంగ శ్రవణం.. నటరాజస్వామి ఆలయం సమీపంలోని నృత్య నీరాజన కళావేదిక వద్ద సిద్ధాంతి లంకా వెంకటేశ్వరశాస్త్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం పంచాంగాన్ని విడుదల చేశారు. దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, ఈఈ భాస్కర్‌, ఏఈవోలు రమేష్‌, తిరుమలరావు, వైదిక కమిటీ సభ్యులు స్థానాచార్య శివప్రసాదశర్మ, శ్రీనివాసశాస్త్రి, కోట ప్రసాద్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని