Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భూసారాన్ని సంరక్షించాల్సిన సమయం ఆసన్నమైంది

రైతు శబరీనాథ్‌ను సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

కొర్నెపాడు (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: భూసారాన్ని సంరక్షించాల్సిన సమయం ఆసన్నమైందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. స్థానిక రైతు నేస్తం ఫౌండేషన్‌లో మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా అభ్యదయ రైతులకు ఉగాది పురస్కారాల పంపిణీ జరిగింది. భూసార సంరక్షణ అభియాన్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన లక్ష్మీప్రసాద్‌ ప్రసంగించారు. కొన్ని దశాబ్దాల నుంచి భూమిలో విచక్షణరహితంగా రసాయనాలు వాడి పంటలు సాగు చేయడంతో నేలలన్నీ జీవం కోల్పోయి బండబారి పోయినట్లు చెప్పారు. రైతులు సంఘటితమై భూసారాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. భూసార సంరక్షణ అభియాన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించి రైతులకు అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మట్టిని పూజించారు. పూజ చేసిన మట్టిని తిరిగి రైతులు తమ వెంట తీసుకెళ్లారు. భూసారాన్ని రక్షిస్తూ రసాయనాలు వాడకుండా పంటలు సాగు చేస్తున్న అభ్యుదయ రైతులు చెరుకూరి విజయ్‌ (పుల్లడిగుంట), ముప్పా బ్రహ్మయ్య (వట్టిచెరుకూరు), మాధవరెడ్డి (గుంటూరు), కొండా కిశోర్‌రెడ్డి (తూములూరు), పల్లబోతు శబరీనాథ్‌ (మైలవరం), హనుమాన్‌ కిశోర్‌ (కురిచేడు), పరమాత్మల కోటేశ్వరమ్మ (కొప్పర్రు), కోదండం రాఘవయ్య (నరసరావుపేట)లను శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కంజర్వేటర్‌ చిరంజీవి చౌదరి, నాబార్డు డీజీఎం రమేశ్‌బాబు, భాజపా కిసాన్‌ సంఘ్‌ కార్యదర్శి కుమారస్వామి, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ రాజు, ప్రముఖులు మాదల శ్రీనివాస్‌, నేరేళ్ల తిరుపతిరావు కొర్నెపాడు, పుల్లడిగుంట సర్పంచులు బత్తుల మానస, షేక్‌.పర్వినా సుల్తానా పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని