Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

పెడనగ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో డిగ్రీ (2020-21) చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీఎస్‌ ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని దీనికోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా మేనేజర్‌ ఈ.తమ్మాజీరావు తెలిపారు. బిజినెస్‌ ప్రాసెసింగ్‌ సర్వీసు(బీపీఎస్‌) ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. మొదట నమోదు చేసుకున్న వారికి పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. మే 1, 13న రెండు విడతలుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తానన్నారు. బీఎస్‌సీ(కంప్యూటర్‌ సైన్సు), బీసీఏ విభాగాలకు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. పదోతరగతి నుంచి ఇప్పటి వరకు 5 సీజీపీఏ లేదా 50 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఒక బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టు ఉన్న వారికి కూడా అవకాశం ఇస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు https://nextstep.tcs.com/ campus/#/ అనే ఫోర్టల్‌లో సంబంధిత వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని