Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శోభాయమానం.. ఆది దంపతుల రథోత్సవం

ఊరేగింపులో పాల్గొన్న ఆలయ ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తదితరులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీప్లవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆది దంపతుల వెండి రథోత్సవం మంగళవారం శోభాయమానంగా నిర్వహించారు. వెండి రథంపైన నూతన సింహాలను అమర్చిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఊరేగింపు కావడంతో దేవస్థానం ఉద్యోగులతో పాటు భక్తులు ఆసక్తిగా ఈ వేడుకను తిలకించారు. మల్లికార్జున మహా మండప ప్రాంగణంలో గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులను అలంకరించిన వెండి రథంలో ఉంచి అర్చకులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, పశ్చిమ ఏసీపీ హనుమంతరావు రథోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కనకదుర్గానగర్‌ నుంచి రథం సెంటరు, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, రమణయ్య కూల్‌డ్రింక్‌ షాపు సెంటరు, మీదుగా వన్‌టౌన్‌ పోలీసు స్టేషనుకు చేరింది. నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్టేషను ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీపీ దంపతులు తిలకించారు. అనంతరం వెండి రథం కెనాల్‌ రోడ్డు మీదుగా తిరిగి మల్లికార్జున మహా మండపానికి చేరింది. దేవస్థానం ఈఈ భాస్కర్‌, స్థానాచార్య శివప్రసాదశర్మ, వేదపండితులు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని