Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం

నందిగామ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతులంతా సంఘటితంగా పోరాటం చేయాలని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరావు కోరారు. స్థానిక వర్కింగ్‌ జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో మంగళవారం అఖిల పక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ... స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ... వాటిని పక్కన పెట్టి కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని, వాటి వల్ల వ్యవసాయం మరింత సంక్షోభంలోకి వెళ్తుందని తెలిపారు. రాయితీతో అందించే వ్యవసాయ విద్యుత్తు విధానాన్ని రద్దు చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 19న విజయవాడలో నిర్వహిస్తున్న కార్మిక, కర్షక శంఖారావ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కేశవరావు మాట్లాడుతూ.. ఈనెల 18న విశాఖలో, 19న విజయవాడలో నిర్వహించే కార్మిక, కర్షక శంఖారావ సభలకు పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు హాజరు కావాలని కోరారు. నాయకులు రావుల వెంకయ్య, హరినాథ్‌, పి.వి. ఆంజనేయులు, యలమందరావు, పాలేటి సతీష్‌, వాసిరెడ్డి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని