Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసుల పేరుతో బెదిరింపులు

నందివాడ, న్యూస్‌టుడే : పోలీసుల పేరుతో బెదిరించిన నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. జంక్షన్‌ మీదుగా గొర్రెల మంద జనార్దనపురం వైపు వస్తోంది. మందలోని ఒక గొర్రె నడవలేకపోవడంతో కాపలాదారు దాన్ని బైక్‌పై పెట్టుకొని వాటి వెనుకాలే వస్తున్నారు. అదేసమయంలో కొందరు యువకులు పోలీసుల పేరు చెప్పి వారిని బెదిరించి గొర్రెను తీసుకెళ్లారు. అనంతరం దానిని కోసి పంచుకున్నారు. కాపలాదారుల ఫిర్యాదు మేరకు నందివాడకు చెందిన ఎం.పూర్ణ ప్రసాద్‌, పి. జగదీష్‌ కుమార్‌ రెడ్డి, ఆర్‌.వెంకటేశ్వరరావు, ఆర్‌.భాస్కరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని