Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యా ప్రగతికి కలెక్టరు సోదరుల సహకారం

కోడుమూరులో నిర్మించిన అదనపు తరగతి గదులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కృష్ణా జిల్లా కలెక్టరు ఏఎండీ ఇంతియాజ్‌, ఆయన సోదరుడు ఏఎండీ అస్లాం (కత్తర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్సు, ఎయిర్‌ పోర్టు ఐటీ సలహాదారు)లు మాతృ భూమిపై మమకారం చూపుతూ, వారు చదువుకున్న పాఠశాల ప్రగతికి సహకారం అందించారు. 1979-80 కాలంలో కోడుమూరులోని జీవీఆర్‌ బాలుర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యను అభ్యసించిన ఇంతియాజ్‌.. కలెక్టరు స్థాయికి ఎదిగారు. రామ్‌ కో సిమెంట్సు జయంతి ప్లాంట్‌ ఆర్థిక సహకారం, ఇంతియాజ్‌ సౌజన్యంతో సీఎస్‌ఆర్‌ కింద రూ.25 లక్షల అంచనాతో నిర్మించిన నాలుగు అదనపు తరగతుల భవనాన్ని ఇంతియాజ్‌, అస్లామ్‌ సోదరులు మంగళవారం ప్రాంభించారు. పాఠశాలకు తన సోదరుడు మూడు కంప్యూటర్లను అందించనున్నట్టు ఇంతియాజ్‌ తెలిపారు. మంచి, మానవత్వం వైపు అడుగులు వేయాలని తెలిపే ఉగాది పండగ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాస్‌యాదవ్‌, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌ బి.ఫణీంద్రనాథ్‌రెడ్డి తదితరులు కలెక్టరు సోదరులను అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని