Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేడు అంబేడ్కర్‌ జయంతి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఈనెల 14వ తేదీ బుధవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని, రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు కళా క్షేత్ర ప్రాంగణం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కళా క్షేత్రంలో జయంతి మహోత్సవ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, సాంఘిక శాఖ సంక్షేమ సంచాలకులు (ఎఫ్‌ఏసీ), పీఆర్‌.. ఆర్డీ కార్యదర్శి ఐ.శ్యామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్‌ బాషా, కృష్ణా కలెక్టరు ఇంతియాజ్‌ తదితరులు హాజరుకానున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని