Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫరవాలేదు!

జిస్ట్రేషన్‌శాఖకు ఓ మోస్తరు ఆదాయం
గుంటూరు, న్యూస్‌టుడే

రాజధాని అమరావతిపై అనిశ్చితి.. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలోనూ మార్చి 31తో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల నుంచి నిర్దేశిత లక్ష్యంలో సుమారు 70 శాతం ఆదాయం సమకూరింది. రాజధాని అమరావతి తరలింపు ప్రకటనతో రాజధాని ప్రాంతమైన అమరావతి, మంగళగిరి, తాడికొండ, పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో భూములు, స్థలాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనలతో తెనాలి, నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో బాగా ఆస్తుల లావాదేవీలు జరిగాయి. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మాత్రం రాజధాని ప్రభావంతో బాగా ఆదాయం తగ్గుముఖం పట్టింది. తెనాలి, నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి లక్ష్యానికి అనుగుణంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుల ఆదాయం బాగా వసూలైంది.

2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలి

స్తే 2020-21లోనే 2.64 శాతం అధికంగా వసూలు కావడం జిల్లా రిజిస్ట్రేషన్‌ వర్గాలకు ఊరటనిచ్చింది. 2019-20లో రూ.606.02 కోట్లు లభించగా 2020-21లో మాత్రం రూ.16 కోట్లు అదనంగా వచ్చిందని రిజిస్ట్రేషన్‌ వర్గాలు తెలిపాయి. లక్షిత ఆదాయంలో జిల్లా నుంచి 70 శాతం మేర ఆదాయం రావటం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో బాగా వచ్చినట్లేనని అధికారులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని