Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆన్‌లైన్‌లో కానరాని ఆస్తి పన్ను రశీదు

ఈనాడు-గుంటూరు

గర, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తున్నవారికి రశీదు రావటం లేదు. గతంలో ఇది ఆన్‌లైన్‌లోనే జనరేట్‌ అయ్యేది. ప్రస్తుతం చెల్లింపు విజయవంతమైనది అని మాత్రమే చరవాణికి ఎస్సెమ్మెస్‌ వస్తుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రంగా ఉండటంతో చాలా మంది నగర, పురపాలక కార్యాలయాల్లోని పన్ను కౌంటర్ల వద్దకు వెళ్లి క్యూలో నిలుచుని చెల్లింపులు చేయటానికి ఇష్టపడటం లేదు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఆధారం లేకపోవడంతో కౌంటర్ల వద్దకే పరుగులు తీస్తున్నారు. పురపాలకలశాఖలో పన్ను చెల్లింపులు ఈఆర్‌పీ విధానంలోకి వచ్చాయి. గతంలో నగర, పురపాలికలకు వేర్వేరుగా సర్వర్‌ ఉండేది. దీంతో ఈ సమస్య వచ్చేదికాదు. ఈఆర్‌పీ విధానంలో రాష్ట్రంలోని అన్ని నగర, పురపాలికలు ఒకే సర్వర్‌ ద్వారా చెల్లింపులు చేస్తుండటంతో దానిపై విపరీతమైన రద్దీపడి రశీదు రావడం లేదని తెలుస్తోంది. గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి, తెనాలి,  పొన్నూరు,. బాపట్ల, రేపల్లె, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలికల్లోనూ ఈ సమస్య ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు పన్ను చెల్లించాలనుకున్నా సీడీఎంఏ సైట్‌లోకి వెళ్లాల్సిందే. ప్రభుత్వం మార్పులు చేస్తుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యపై గుంటూరు నగరపాలక వర్గాలను వివరణ కోరగా  కొంత సమస్య ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే అస్సెస్‌మెంట్‌దారులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన తర్వాత వారి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీనికి 40-50 సెకన్లు సమయం తీసుకుంటుంది. అప్పటి వరకు వేచిచూడకుండా చాలా మంది రశీదు రాలేదని ఆందోళన చెందుతున్నారన్నారు. చెల్లింపు విజయవంతమైతే రశీదు లేకపోయినా ఇబ్బంది లేదన్నారు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని