Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్ష్యం

50 వేల మందికి టీకా వేసే
నేటి నుంచి 132 కేంద్రాల్లో నిర్వహణ
ఈనాడు అమరావతి

రోనా టీకా నిల్వలు జిల్లాకు చేరటంతో యంత్రాంగం వాటిని యుద్ధ ప్రాతిపదికన 45 ఏళ్లు పైబడినవారికి వేయటానికి కార్యాచరణ సిద్ధం చేసింది. బుధవారం ఒక్కరోజే 50 వేల మందికి టీకా వేయాలని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మంగళవారం సాయంత్రానికి టీకా నిల్వలు మండలాలకు చేర్చారు. జేసీ ప్రశాంతి ఆదేశాల మేరకు కార్యక్రమం పర్యవేక్షణకు ప్రతి మండలానికి నోడల్‌ అధికారులను నియమించారు. అదేవిధంగా మండల టాస్క్‌ఫోర్సు కమిటీలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ దీనికి కన్వీనర్‌గా ఉంటారు.  వీరు ఎక్కడికక్కడ టీకా అందుబాటులో ఉంచేలా చూడటంతో పాటు పారామెడికల్‌ సిబ్బంది లక్ష్యం మేరకు టీకా వేసేలా చూడాలని సూచించారు. గత నాలుగు రోజుల నుంచి గుంటూరు, నరసరావుపేట డివిజన్లలో 15 ఏళ్ల పైబడిన వారికి సిరో సర్వేలెన్స్‌లో భాగంగా రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఆ రెండు డివిజన్లలో సర్వే పూర్తి కావటంతో బుధవారం నుంచి తెనాలి డివిజన్‌లో చేపట్టాలనుకున్నారు. వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా వరకు పారామెడికల్‌ సిబ్బందిని టీకా పండగలో పాల్గొనాలని సూచించారు. దీంతో సిరో సర్వేలెన్స్‌కు కొంత అవరోధం కలిగే అవకాశం లేకపోలేదు.  
గుంటూరులో కేసుల తీవ్రత.. రాష్ట్రంలో కరోనా ఉద్దృతి ఉన్న జిల్లాల్లో గుంటూరు ముందంజలో ఉంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కేసుల తీవ్రత బాగా పెరిగింది. మార్చిలో సగటున రోజుకు 70 కేసులు రాగా ఏప్రిల్‌లో సగటున రోజుకు 400 కేసులకు తగ్గకుండా నమోదవుతున్నాయి. కేసులు ఒకేసారి మూడు రెట్లు పెరిగాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో నమోదువుతున్న కేసుల్లో సింహభాగం గుంటూరు నగరంలోనే ఉంటున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని