Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒంగోలు జాతి పశుసంపద పరిరక్షణకు కృషి

జూనియర్‌ విభాగంలో మొదటి బహుమతి సాధించిన లింగాయపాలెం, శానంపూడి ఎడ్లజత

తాడేపల్లి: ఒంగోలుజాతి పశుసంపద పరిరక్షణకు రైతులు కృషి చేయాలని వైకాపా స్థానిక సంస్థల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు.  కుంచనపల్లిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు జూనియర్‌ విభాగం పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. లింగాయపాలెం, శానంపూడికి చెందిన అమృతపూడి కోటయ్య, ఎల్లం సాంబశివరావుల ఎడ్లజత ప్రథమ స్థానం సాధించింది. వీరికి రూ.70వేలు నగదు అందజేశారు. వేమూరు మండలం వరాహపురానికి చెందిన మువ్వాశ్రీనివాసరావు ఎడ్లజత మూడో బహుమతిని గెలుపొందింది. వీరికి రూ.40 వేలు నగదు అందజేశారు. కమిటీ ప్రతినిధులు సందీప్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి, కోటిరెడ్డి, సాయిరామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్‌ ఎడ్లజతల బండలాగుడు పోటీలను మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రారంభించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని