Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిశోధనల ఫలాలు రైతులకు చేరినపుడే ఫలితం

జిల్లాపరిషత్తు(గుంటూరు): శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు రైతులకు చేరినపుడే ఫలితం సాధించినట్లవుతుందని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టరు ఎ.విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో ఉగాది వేడుకలు నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ ఆంగ్రూ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి విడుదల చేసిన వంగడాలు దేశ వ్యాప్తంగా రైతులు వినియోగించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలకు ఎంపికయిన శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, రైతులను అభినందించి దుశ్శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. తొలుత పంచాంగకర్త సత్యనారాయణ పంచాంగ శ్రవణం చేశారు. సమావేశంలో ఆంగ్రూ పాలక మండలి సభ్యుడు బచ్చు శ్రీనివాసరావు, రిజిస్ట్రార్‌ టి.గిరిధరకృష్ణ, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  విశిష్ట రైతు పురస్కారాన్ని డాక్టర్‌ యరగూటి సాంబశివారెడ్డి (నకరికల్లు మండలం కుంకలగుంట), ఉత్తమ రైతు పురస్కారాన్ని ఆరుమళ్ల సాంబిరెడ్డి (తాడేపల్లి మండలం కుంచనపల్లి) అందుకున్నారు. శాస్త్రవేత్తల విభాగంలో డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌(బాపట్ల వ్యవసాయ కళాశాల ఆచార్యులు),  డాక్టర్‌ బిల్కిస్‌(గుంటూరు సాంఘిక విజ్ఞాన కళాశాల ఆచార్యులు), డాక్టర్‌ ఎ.సాంబయ్య- వ్యవసాయ వర్శిటీ సీనియర్‌ శాస్త్రవేత్త పురస్కారాలు అందుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని