Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొస్తాం

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి చెప్పారు. మంగళవారం అకాడమీ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య హేమచంద్రారెడ్డి కప్పగంతు రామకృష్ణ రచించిన ఉగాది పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఐదుగుర్ని సత్కరించారు. ఏఎన్‌యూ రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, ప్రముఖ అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్‌, విజ్ఞానశాస్త్రం నుంచి లక్ష్మణసూరి, విద్యారంగం నుంచి ఆచార్య ఎంసీ దాస్‌, సేవారంగం నుంచి గోళ్ల నారాయణరావులకు ఉగాది పురస్కారాలు అందించారు. అనంతరం   హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ పండుగ పేరుతో మన పూర్వీకులు అనంతమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించారన్నారు. అకాడమీ ఛైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ గత ఏడేళ్లుగా తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించలేదన్నారు. ఈ ఏడాది నుంచే ఇంటర్‌ పుస్తకాలు, పోటీ పరీక్షల పత్రాలను అచ్చువేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వర్సిటీ వీసీ ఆచార్య రాజశేఖర్‌ మాట్లాడుతూ తెలుగు అకాడమీ కార్యాలయాన్ని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేయాలని కోరారు. అకాడమీ సంచాలకులు రామకృష్ణ మాట్లాడుతూ దీనికి ఘన చరిత్ర ఉందని, కవులు, రచయితలతో చర్చాగోష్ఠులు నిర్వహిస్తామన్నారు.   అనంతరం కప్పగంతు రామకృష్ణ పంచాంగం వినిపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని