Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివాహేతర సంబంధంతోనే రామకృష్ణ హత్య

పొన్నూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఉప్పరపాలెంలో వివాహేతర సంబంధంతోనే నక్కా రామకృష్ణను గొడ్డలితో నరికి హత్య చేశారని బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం పొన్నూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 10న రామకృష్ణ, మరో మహిళ ఒకే గదిలో ఉండడాన్ని గమనించిన ఆ మహిళ భర్త తాడిశెట్టి సింహాచలం, తాడిశెట్టి ప్రసాదరావులు కలిసి రామకృష్ణను కర్రతో కొట్టి, గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారని ఆయన వెల్లడించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుననే అతన్ని హత్య చేసినట్టు మహిళ భర్త సింహాచలంతో పాటు మరో నిందితుడు ప్రసాదరావులు విచారణలో అంగీకరించారని డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చామన్నారు. కేసును కొలిక్కితెచ్చిన పొన్నూరు గ్రామీణ సీఐ ఎ.శ్రీనివాసరావు, ఎస్‌ఐ భాగ్యరాజ్‌లను డీఎస్పీ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని