Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరని కాష్ఠం

శ్మశానానికి పెరిగిన మృతదేహాల తాకిడి

గుణదలలో బారులుతీరిన అంబులెన్సులు

కొత్తాసుపత్రి కూడలి, న్యూస్‌టుడే: కొవిడ్‌ రెండో దశ బెజవాడ నగరాన్ని వణికిస్తోంది. మహమ్మారి సోకి నగర ప్రజలు ప్రాణాలొదులుతున్నారు. ఆ మృతదేహాలను కాల్చడం సిబ్బందికి ప్రహసనంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలోనే గుణదల శ్మశాన వాటిన ఉంది. గతంలో రోజుకు 4, 5 మృతదేహాలకు ఇక్కడ దహనక్రియలు జరిగేవి. కరోనా విజృంభణతో సుమారు రోజుకు¨ 50 మృతదేహాలు దహనంచేస్తున్నట్లు నగరపాలక సంస్థ వద్ద లెక్కలు చెబుతున్నాయి.  ఈఎస్‌ఐ ఆస్పత్రి జంక్షన్‌ నుంచి గుణదల పాత పంచాయతీ కార్యాలయం వెళ్లే రహదారిలో అంబులెన్సులు శవాలతో బారులు తీరుతున్నాయి. మృతులకు సంబంధించిన బంధువులు కూడా రావడంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. అంబులెన్సుల నిర్వాహకులు ఒక్కో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకొచ్చేందుకు రూ.20 వేలకు పైగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. రోజూ ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 వరకు సుమారు 15 మంది కాటికాపరులు దహనక్రియలను కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి వరకు అంబులెన్స్‌లు వస్తున్నాయి. కృష్ణలంకలోని విద్యుత్తు క్రిమిటోరియం మరమ్మతులకు గురికావడంతో గుణదల శ్మశానానికే ఎక్కువగా మృతదేహాలను తీసుకొస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని