Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2 కిలోల గంజాయి పట్టివేత

గుడివాడ, న్యూస్‌టుడే: పోలీసులకు అందిన సమాచారం మేరకు నాగవరప్పాడు వంతెన వద్ద గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. యువకులు ప్రయాణిస్తున్న మోటార్‌బైక్‌ను అనుమానంతో ఆపి తనిఖీలు చేయగా 2 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మాదిరెడ్డి వీరబాబు, ఆవుల అశోక్‌ కలిసి బైక్‌లు దొంగతనం చేసి వాటిని తక్కువ ధరకు గంజాయి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. వారి వద్ద నుంచి గంజాయి తెచ్చి జిల్లాలో అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని