Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: ఎ.కొండూరు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పఠాన్‌ మాహబూబ్‌ఖాన్‌(37), జాలాది శ్రీకాంత్‌(31) వ్యక్తిగత పనుల నిమిత్తం గురువారం తిరువూరు వచ్చారు. పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతుండగా, పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఒక లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దర్నీ చికిత్స నిమిత్తం తిరువూరు తరలిస్తుండగా, మార్గంమధ్యలో కన్నుమూశారు. ఎ.కొండూరు ఇన్‌ఛార్జి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని