జిల్లాలో 461 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
logo
Published : 16/06/2021 02:59 IST

జిల్లాలో 461 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

151 మందికి శస్త్ర చికిత్సలు

 

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఇప్పటి వరకు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 461 నమోదవగా, వీరిలో 151 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయమై వైద్య నిపుణులు, వైద్యులతో మంగళవారం ప్రత్యేకంగా సమీక్షించినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్‌, రాష్ట్ర కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఛైర్మన్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కరోనా నియంత్రణ చర్యలపై మంగళవారం రాత్రి జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టర్‌ పాల్గొని జిల్లాలోని పరిస్థితులను వివరించారు. ఇప్పటి వరకు 11,88,017 మందికి కొవిడ్‌ టీకా వేసినట్టు తెలిపారు. ఒక్క రోజులోనే 3,177 మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు పేర్కొన్నారు. 44 కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3,584 పడకలు ఉండగా, 1,692 మంది చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఐసీయూ పడకలు 48, ఆక్సిజన్‌తో కూడిన పడకలు 909, సాధారణ పడకలు 935 అందుబాటులో ఉన్నట్టు వివరించారు. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్తగా 106 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరగా, 140 మంది డిశ్ఛార్జ్‌ అయినట్టు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని