భారీగా రేషన్‌ బియ్యం స్వాధీనం
logo
Published : 16/06/2021 02:59 IST

భారీగా రేషన్‌ బియ్యం స్వాధీనం


గోదాములోని రేషన్‌ బియ్యం వద్ద అధికారులు

చల్లపల్లి, న్యూస్‌టుడే : మండలంలోని మాజేరులో సీజ్‌ చేసిన గోదాములో భారీ స్థాయిలో రేషన్‌ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఘంటసాల మండలం కొడాలి ఎం.ఎల్‌.ఎస్‌. పాయింట్‌ నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని నేరుగా మాజేరులోని గోదాముకు తరలించారని ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ తుమ్మల మురళీ ఫిర్యాదు చేయగా అధికారులు సంబంధిత గోదాముకి సీలువేసిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం గోదాము యజమాని చలువాది సురేంద్ర(సస్పెండైన డీలరు), గ్రామస్థుల సమక్షంలో రెవెన్యూ అధికారులు సీలు తీసి తనిఖీ నిర్వహించారు. గిడ్డంగిలో ఉన్నవి రేషన్‌ బియ్యంగా అధికారులు గుర్తించారు. 50 కిలోల బస్తాలు 344, మరో 24 తెల్లసంచుల్లో రేషన్‌ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. పీడీఎస్‌ డీటీ హేమంత్‌, ఆర్‌ఐ ఐ.శివరామకృష్ణ, వీఆర్వో నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని