తండ్రి రుణం తీర్చుకున్న కుమార్తెలు
logo
Published : 16/06/2021 02:59 IST

తండ్రి రుణం తీర్చుకున్న కుమార్తెలు


తండ్రి ఉప్పాల రామకోటేశ్వరరావు మృతదేహం వద్ద శాస్త్రోక్తంగా కర్మకాండలు చేస్తున్న కుమార్తె డాక్టర్‌ మాధవీలత

గుంటూరు (జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం కలిగినా బాధపడలేదు. ఐదుగురినీ ఉన్నత విద్య చదివించి ప్రయోజకులను చేశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో మరణించిన ఆ తండ్రికి కుమార్తెలే మంగళవారం కర్మకాండలు నిర్వహించి రుణం తీర్చుకున్నారు. గుంటూరులోని సీతానగరానికి చెందిన ఉప్పాల రామకోటేశ్వరరావు (82) సహకార శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన సతీమణి సామ్రాజ్యం ఆర్‌అండ్‌బీ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ విరమణ చేశారు. వీరికి ఐదుగురు ఆడపిల్లలైనా అందరినీ బాగా చదివించారు. రెండో కుమార్తె విజయశ్రీ రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో విభాగ అధికారిణి కాగా.. మూడో కుమార్తె డాక్టర్‌ మాధవీలత తుళ్లూరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి. మిగిలిన ముగ్గురు కుమార్తెలు ప్రశాంతి, శ్రీదేవి, నీలిమ వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఈనెల 13వ తేదీ రాత్రి తండ్రి మరణించడంతో కుమార్తె డాక్టర్‌ మాధవీలత తండ్రి చితికి నిప్పంటించగా.. మిగిలిన నలుగురూ ఆ ప్రక్రియలో పాల్గొని ఆయనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. బంధువులు కర్మకాండలు నిర్వహించేందుకు ముందుకొచ్చినా మా నాన్న రుణం తీర్చుకోవడానికి తామే అంత్యక్రియలు నిర్వహించామని కుమార్తె విజయశ్రీ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని