బయట తిరగొద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
logo
Published : 16/06/2021 02:59 IST

బయట తిరగొద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య


మృతుడు సురేంద్ర

వట్టిచెరుకూరు: కరోనాతో ప్రమాదం పొంచి ఉంది, బయట తిరగొద్దని తండ్రి మందలించడానికి కొడుకు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన మేరకు.. వట్టిచెరుకూరుకు చెందిన రావి సురేంద్ర (23) ప్రతిరోజూ రాత్రి వరకు ద్విచక్ర వాహనంపై బయట తిరుగుతుంటాడు. ఈ నేపథ్యంలో 14న తండ్రి వెంకటేశ్వరరావు ఎందుకు అలా బయట తిరుగుతావు, కరోనా వస్తే ఎలాగని గట్టిగా మందలించారు. దీనికి మనస్తాపం చెందిన సురేంద్ర జల్లవాగు సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, మిత్రులు అతడిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. మృతుడి సోదరుడు అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని