మిర్చియార్డులో జోరుగా క్రయవిక్రయాలు
logo
Published : 16/06/2021 02:59 IST

మిర్చియార్డులో జోరుగా క్రయవిక్రయాలు


మిర్చియార్డులో లావాదేవీలకు తీసుకొస్తున్న మిర్చి బస్తాలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యార్డులో లావాదేవీలు పునఃప్రారంభమైన రెండో రోజు మంగళవారం 39,432 బస్తాలు యార్డుకు వచ్చాయి. వాటిలో 37,489 బస్తాలు క్రయవిక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 7,743 బస్తాలు నిల్వ ఉన్నాయి.

* నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884 రకాల మిర్చి సగటు ధర రూ.6800 నుంచి రూ.15,300 ఉండగా, తేజ రూ.7000 నుంచి రూ.16,800, బాడిగ రూ.7000 నుంచి రూ.17,600, తాలు మిర్చికి రూ.5000 నుంచి రూ.8000 ధర లభించింది.

* ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884 రకాల మిర్చి సగటు ధర రూ.7200 నుంచి రూ.16,200 ఉండగా, తేజ రూ.7000 నుంచి రూ.17,100, బాడిగకు రూ.9000 నుంచి రూ.17,600, తాలు మిర్చికి రూ.5000 నుంచి రూ.8500 ధర లభించింది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో శీతలగిడ్డంగుల్లో నిల్వ ఉంచిన సరకును విక్రయించుకునేందుకు రైతులు ఆసక్తి కనపరుస్తున్నారు. హమాలీలు కొరత ఉందని, శీతలగిడ్డంగుల నిర్వాహకులు తాత్సారం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని