కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమం
logo
Published : 16/06/2021 03:39 IST

కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమం


ధర్నాలో మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు బాబూరావు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో సంఘటితంగా ఉద్యమిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్‌.బాబూరావు హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ. ప్రధాన కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్సు యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కార్మికులు పనిచేస్తున్నా, వారికి నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. సంఘ నాయకులు బోయ సత్యబాబు, సుబ్బరావమ్మ మాట్లాడుతూ కార్మికులు గత్యంతరం లేకే తమ వేతనాల కోసం రోడ్లమీదకు వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎం.డేవిడ్‌, మార్తమ్మ, ప్రవీణ్‌, సుబ్బారెడ్డి తిరుపతమ్మ, కార్మికులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని