డిస్కంల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
logo
Published : 16/06/2021 03:39 IST

డిస్కంల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి


ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకులు

గుణదల, న్యూస్‌టుడే: విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కం)ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం గుణదల విద్యుత్తు సౌధ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో కొనసాగే విద్యుత్తు పంపిణీ సంస్థలను ప్రైవేటు వారికి అప్పగిస్తే అదనంగా జీడీపీలో 0.5 అప్పు అవకాశం ఇస్తామని కేంద్రం చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇలాంటి సమయంలో విద్యుత్తు రాయితీని తీసివేయాలని కుట్రలు పన్నడంపై మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లుకు విద్యుత్తు మీటర్లు బిగించే విధానానికి స్వస్తి పలకాలని, జీవో నెంబరు 22 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు పంచకర్ల రంగారావు, మాదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని