కష్టకాలంలో ‘వాహనమిత్ర’లకు సాయం
logo
Published : 16/06/2021 03:39 IST

కష్టకాలంలో ‘వాహనమిత్ర’లకు సాయం


ఆటో ర్యాలీని ప్రారంభిస్తున్న హోంమంత్రి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ద్వారా జిల్లాలో 22,527 మంది లబ్ధిదారులకు రూ.22.527 కోట్లను ఆయా వాహనమిత్రల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్‌ వాహనమిత్ర నగదును లబ్ధిదారుల ఖాతాలకు మంగళవారం జమ చేశారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో అందిస్తున్న ఆర్థిక సాయం చాలా గొప్పదని, సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారనన్నారు. అనంతరం గుంటూరు నగరానికి చెందిన ఆటోడ్రైవర్‌ మురళీ శ్రీనివాస్‌తో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం వాహనమిత్ర లబ్ధి పొందిన ఆటోడ్రైవర్లతో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీని హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జగన్‌ సుదీర్ఘ పాదయాత్రలో ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసి వారికి ఆర్థికంగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత వాహనమిత్ర ద్వారా ఆటోడ్రైవర్లకు సాయం అందిస్తున్నారన్నారు. అర్హత ఉండి లబ్ధి పొందని వారు సైతం సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారన్నారు. ఆటోడ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సీఎం స్వయంగా సూచించారన్నారు. తొలుత వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కును అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, కె.ఎస్‌.లక్ష్మణరావు, కల్పలత, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌రావు, ముస్తఫా, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతి, శిక్షణ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, డీఆర్‌వో పి.కొండయ్య, ఉప రవాణా కమిషనర్‌ మీరాప్రసాద్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని