రెండు వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
eenadu telugu news
Published : 29/07/2021 04:41 IST

రెండు వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

వన మహోత్సవానికి ఏర్పాట్లు


అటవీ అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, చిత్రంలో ఎమ్మెల్యే ఆర్కే, అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హాఫీజ్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: నగరంలోని ఎయిమ్స్‌ ఆవరణలో ఆగస్టు 5న నిర్వహించనున్న వనమహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సమీక్షించారు. ఆయన బుధవారం ఎయిమ్స్‌ ఆవరణలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హాఫీజ్‌, అటవీశాఖ డీఎఫ్‌వోలు రామచంద్రరావు, విజయకుమార్‌తో పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయర విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే వనమహోత్సవాన్ని మంగళగిరిలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఎయిమ్స్‌ ఆవరణలో రెండు వేల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. సభ నిర్వహణకు వేదిక, కాన్వాయ్‌ రాకపోకలకు వీలుగా అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌, అదనపు ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ డి.దుర్గాప్రసాద్‌తో చర్చించామన్నారు. వేదిక స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి అనుచరులు, మీడియా ప్రతినిధులకు 200, స్థానిక ఎమ్మెల్యే ఆర్కే నియోజకవర్గంలో 200 మందికి పాస్‌ల మంజూరుపై చర్చించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి నేరుగా వడ్డేశ్వరం వైపు నుంచి ఎయిమ్స్‌కి వచ్చేలా మార్గం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన 5 నుంచి 6 అడుగుల ఎత్తుండే వివిధ రకాల మొక్కలు నాటేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్‌ వెంట జేసీ దినేష్‌ కుమార్‌, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక కమిషనర్‌ పి.నిరంజన్‌రెడ్డి తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని