జేఎన్‌టీయూ నిర్మాణాలు ఏట్టకేలకు మొదలు
eenadu telugu news
Published : 29/07/2021 04:41 IST

జేఎన్‌టీయూ నిర్మాణాలు ఏట్టకేలకు మొదలు

గుంటూరు జిల్లా నరసరావుపేట జేఎన్‌టీయూ (జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం) భవన నిర్మాణలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మోత్తం 87 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2018లో జేఎన్‌టీయూ భవన నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.80కోట్ల నిధులతో భవన నిర్మాణ పనులను నిధులు కేటాయించారు. 14 నెలల కాల వ్యవధిలో పూర్తి చేయాలనే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. ఈ మేరకు పనులను అధికారులు వేగవంతం చేశారు. మరో రూ.40కోట్లు మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు చేయడానికి అంగీకరించింది. ఇందులో భాగంగా వసతిగృహాల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే క్రీడా కాంప్లెక్స్‌ నిర్మించాలని అధికారులు సన్నహాలు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా విద్యార్థులకు నరసరావుపేటలోని ఓ కళాశాల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 బ్యాచ్‌ల విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని బయటికెళ్లడం విశేషం. ఈ ఏడాది అయినా కళాశాల భవనాలు అందుబాటులోకి వస్తాయా అని విద్యార్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

నరసరావుపేట వద్ద నిర్మించిన జేఎన్‌టీయూ ప్రహరీ

- ఈనాడు గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని