జిల్లాలో 14.71లక్షల మందికి టీకాలు
eenadu telugu news
Published : 29/07/2021 04:41 IST

జిల్లాలో 14.71లక్షల మందికి టీకాలు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ టీకాలు మొదటి డోసు 14.71 లక్షల మందికి వేసినట్లు జిల్లా వైద్యాధికారిణి యాస్మిన్‌ చెప్పారు. బుధవారం పిడుగురాళ్ల పురపాలక సంఘం కార్యాలయంలో ఆమె జనన, మరణ రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో నాలుగు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా టీకాలు వేస్తున్నారని చెప్పారు. వైద్య విద్యార్థులు, నర్సింగ్‌ విద్యార్థులకు, విదేశాలు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేస్తునట్లు చెప్పారు. మిగిలిన విద్యార్థులకు కూడా త్వరలో టీకాలు వేస్తారని చెప్పారు. పిడుగురాళ్ల పురపాలక సంఘం పరిధిలో ఓ వ్యక్తి చనిపోతే వారి వారసులకు వేర్వేరు తేదీల్లో మరణ ధ్రువపత్రాలు ఇచ్చారు. ఆ ఘటనపై విచారణ చేయటానికి వచ్చినట్లు తెలిపారు. కార్యాలయంలోని జనన,మరణ రికార్డులను ఆమె పరిశీలించారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో సుబ్బారావు, వైద్యాధికారిణి శ్యామల ఉన్నారు. జూలకల్లు, పందిటివారిపాలెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లను ఆమె పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని