అత్యాచార బాధితులకు సత్వర పరిహారానికి విజ్ఞప్తి
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

అత్యాచార బాధితులకు సత్వర పరిహారానికి విజ్ఞప్తి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల విషయంలో బాధితులకు సత్వర పరిహారం అందించడంతో పాటు, న్యాయం చేయాలని రాష్ట్ర దళిత బహుజన పరిరక్షణ సమితి (డీబీపీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు నగరంలోని విడిది కార్యాలయంలో కలెక్టర్‌ జె.నివాస్‌కు బుధవారం వినతి పత్రం అందజేశారు. అగ్ర కులాలకు చెందిన యువకులు.. ఎస్సీ యువతులను ప్రేమ, పెళ్లి పేరిట లోబరుచుకుని, చివరకు మోసం చేస్తున్నారని అన్నవరపు పేర్కొన్నారు. మరోవైపు దళితులు, గిరిజనులపై దాడులు చేయడం, హతమార్చడం వంటి ఘటనలు ఉన్నట్టు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఛార్జిషీట్‌ దాఖలు తదితరాల తరుణంలో చెల్లించాల్సిన పాక్షిక పరిహారం, బాధితులకు ఉపాధి చూపే వరకు పింఛను సౌకర్యం, భూములు, ఇళ్లు మంజూరు వంటి విషయాల్లో కాలయాపన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని అన్నవరపు వివరించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో న్యాయవాది కోట జయరాజ్‌, ఎల్‌.జైబాబు, గణేష్‌, పీతల శ్యామ్‌బాబు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని